ఆళ్లగడ్డలోని వకుళా నది వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను శనివారం తహశీల్దార్ జ్యోతి రత్నకుమారి, ఎంపీడీవో నూర్జహాన్, టౌన్ సీఐ యుగంధర్, ఎస్ఐలు నగీన, జయప్ప పరిశీలించారు. తహశీ మాట్లాడుతూ.. నిమజ్జన సమయంలో వాహనాల రాకపోకలకు అడ్డంకులు కలగకుండా చూడాలన్నారు. అనంతరం నిమజ్జన ఏర్పట్లను అధికారులు పరిశీలించి మున్సిపల్, విద్యుత్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.