రామాయంపేటలో ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం మెదక్ జిల్లా రామాయంపేటలో శుక్రవారం మధ్యాహ్నం భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై ఉన్న స్లాబ్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్ పాల్గొన్నారు.