రామాయంపేట మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని తహశీల్దార్ రజనీకుమారి బుధవారం మధ్యాహ్నం తెలిపారు. ఎవరు కూడా పురాతన, పడబడిన ఇళ్లలో నివాసం ఉండవద్దని, ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. వరద ఉద్ధృతి విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరు కూడా బయటకు రావొద్దని, అధికారులకు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారని ఆందోళన చెందవద్దని ఈ సందర్బంగా ఆమె తెలిపారు.