మీడియాలో తప్పుడు వార్తలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించే జర్నలిస్టులపై చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. సీఆర్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ విలేకరుల కోసం పునశ్చరణ తరగతులు శనివారం కర్నూలులోని హోటల్ మౌర్య ఇన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ జర్నలిజం బాధ్యతాయుతమైన వృత్తి అని, సమాజ నిర్మాణంలో విలేకరుల పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు.“మంచి వార్తలు రాస్తే సమాజంలో విలేకరుల విలువ పెరుగుతుంది. ప్రజలు గౌరవిస్తారు. కానీ వాస్తవాలను వక్రీకరించి, బ్లాక్‌మెయిల్ దారిలో