నిర్మల్ జిల్లా కేంద్రంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు విలాస్ మాట్లాడుతూ ఈనెల 11 నుండి 17 వరకు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సీపీఐ పార్టీ చేసిన పోరాట కారణంగానే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనమైందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రమేష్, నాయకులు ఎస్ఎన్ రెడ్డి, సమీర్ కైలాష్ తదితరులు పాల్గొన్నారు.