విద్యుత్ షాక్కు గురై గొర్రెల కాపరి మృతి చెందిన సంఘటన నాగర్కర్నూల్ మండల పరిధిలోని ఔరాశి పల్లి గ్రామంలో చోటు చేసుకున్నట్లు ఎస్సై గోవర్ధన్ మంగళవారం తెలిపారు. బొందలపల్లి గ్రామానికి చెందిన దండు మాసయ్య గొర్రెలు కాసుకుంటూ ఔరాశి పల్లి వద్దకు వెళ్లగా వ్యవసాయ పొలంలో విద్యుత్ షాకు గురై మృతి చెందాడు గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.