మంగళవారం రోజున మండల వ్యవసాయ అధికారిని అలివేణి మాట్లాడుతూ మండలంలో యూరియా కొరత లేదని రైతులు ఇప్పటికే రెండు దఫాలుగా యూరియాను అధిక మొత్తంలో సేకరించి ఉన్నారని రైతులు హైరానా చెందవద్దని మండలంలోని వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోదాముల వద్ద యూరియా సిద్ధంగా ఉందని అవసరానికి మించి రైతులు యూరియా సేకరించడంతోనే ఇలాంటి పరిస్థితి ఎదురైందని ఈ విషయాన్ని రైతులకు గమనించాలన్నారు వ్యవసాయ అధికారిని అలివేణి