సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలను అందించాలని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం పిలుపునిచ్చారు. మైలవరం నియోజకవర్గం లోని పైడూరుపాడు కొత్తూరు తాడేపల్లి గ్రామాల సహకార సంఘాల నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు నెట్టెం రఘురాం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై వారిని అభినందించారు.