ఉల్లి పంటను కొనుగోలను పకడ్బందీగా నిర్వహించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పీ. రంజిత్ భాష ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు కర్నూలు నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోళ్లపై ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు తెచ్చిన ఉల్లిని క్వింటాం 1,200 రూపాయలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఉల్లి రైతులకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉల్లి రైతుల తో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉల్లి కొనుగోళ్లపై అధికారులతో మాట్లాడుతూ ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు.