కడప జిల్లా బద్వేల్ వైయస్ఆర్సిపి అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాధరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్ రాజశేఖరరెడ్డి 16 వ వర్ధంతి సందర్భంగా విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలతో నివాళులు అర్పించారు. ముందుగా ఆయన స్వగృహంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా నాయకులు, కార్యకర్తలతో తరలివెళ్లి సెంటర్లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బెడ్డు పంపిణీ చేశారు.దాదాపు 3,000 మందికి పైగా కార్యక్రమం నిర్వహించారు.