.పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి కళోత్సవాల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాథితిగా ధర్మారం ఏం.ఈ.ఓ ప్రభాకర్ హాజరైయ్యారు. మండలంలోని వివిధ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సింగింగ్, డాన్సింగ్, స్టోరీ టెల్లింగ్ లాంటి 12 అంశాలపై పోటీలను నిర్వహించారు. ఈ పోటిల్లో విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఏం.ఈ.ఓ ప్రభాకర్ మాట్లాడుతూ. సూచించిన 12 అంశాల్లోని ప్రతి అంశం నుండి ప్రథమ స్థానం పొందిన వారిలో ఒకరిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.