పలాస రైల్వే స్టేషన్ లో ఈనెల తొమ్మిదవ తేదీన ఆర్పిఎఫ్ ఎస్సై మల్యాద్రి ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా... 2వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న మూడు లగేజీ బ్యాగులను పరిశీలించగా... 40 కిలోల గంజాయి పట్టుబడిందని శుక్రవారం విలేకరుల సమావేశంలో జి ఆర్ పి సిఐ రవికుమార్ తెలిపారు. ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకొని విశాఖ కోర్టులో హాజరు పరుస్తున్నామన్నారు.