సంగారెడ్డి జిల్లాకు చెందిన బాలిక కూకట్పల్లిలో ఐదు రోజుల క్రితం హత్యకు గురైంది. కేసును కూకట్పల్లి పోలీసులు ఐదవరోజు చేదించారు. బాలిక నివాసం ఉంటున్న సమీపంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి బాలిక ఉంటున్న ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాడు. ఈ క్రమంలో బాలిక తనను చూసిందని గుర్తించి అమానుషంగా బాలికనుహత్య చేశాడు. ఈ మేరకు పోలీసులు పదవ తరగతి విద్యార్థి ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.