Download Now Banner

This browser does not support the video element.

రైతు బాగుంటేనే అందరం బాగుంటాం : పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర

Parvathipuram, Parvathipuram Manyam | Aug 13, 2025
రైతు బాగుంటేనే అందరం బాగుంటామని పార్వతిపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. బుధవారం నరసపురం గ్రామం నుండి పార్వతీపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్ వరకు రైతు ఆనందోత్సవ ర్యాలీని ట్రాక్టర్లతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు 20వేల రూపాయలు అందించడం జరుగుతుంది అన్నారు. ఇటీవల రైతు ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us