జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లో ఒక కోటి 17 లక్షల వ్యయంతో చేపట్టిన సిసి రోడ్ పనులను కార్పొరేటర్ సీఎన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరగా ప్రజలకు సీసీ రోడ్లు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. అలాగే డివిజన్లో ప్రతి కాలనీ అభివృద్ధి చెందడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రతి కాలనీలో రోడ్లు డ్రైనేజీలు మంచినీటి సౌకర్యం శానిటేషన్ వివిధ మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా పాటుపడతానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.