జీకే వీధి మండలం పెద్దవలస మీదుగా నిర్మిస్తున్న నేషనల్ హైవే 516ఇ రోడ్డు నిర్మాణం తో పెదవలస పంచాయితీ పరిధిలో భూములు కోల్పోయిన గిరిజనులను ఆదుకోవాలని ROFR పట్టా కాఫీ రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలనీ అల్లూరి జిల్లా సబ్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్ ను గురువారం రాత్రి 8 గంటల సమయంలో కలిసి జీకే వీధి ప్రజాప్రతినిధులు స్థానికులు సమస్యను వెల్లడించారు. నేషనల్ హైవే 516ఇ నిర్మాణంలో సాగు చేసుకునే భూములను సైతం కోల్పోతున్న వారిని గుర్తించి ప్రభుత్వం తరఫున తగు న్యాయం చేయాలంటూ వారు కోరారు. ఈ కార్యక్రమంలో జీకే వీధి ఎంపీపీ బోయిన కుమారి,జీకే వీధి వైస్ ఎంపీపీ దేముడు తదితరులు పాల్గొన్నారు.