పెడన మండలం లో డివిజనల్ అభివృద్ధి అధికారి పద్మ, ఎంపీడీఓ అరుణకుమారితో కలిసి గురువారం ఉరివి, పెనుమల్లి గ్రామాలను సందర్శించారు. ఉరివిలో రోడ్లు, చెరువుల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం పెనుమల్లి పంచాయతీ కార్యాలయంలో హౌసింగ్, స్వమిత్వ సర్వే మొబిలైజేషన్ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.