రాష్ట్రంలో నెలకొన్న యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని తన ఇంటి వద్ద శనివారం వైసీపీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత నెలకొన్న నేపథ్యంలో ఈ నెల 9న అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించేందుకు వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చిందన్నారు. ఇందులో భాగంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాలు ఎదుట శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు.