నల్లగొండ జిల్లా: జడ్చర్ల కోదాడ హైవే విస్తరణ పడను వేగవంతం చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.మంగళవారం జడ్చర్ల కోదాడ హైవే రోడ్డు విస్తరణ పనులను మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తో కలిసి రోడ్డు విస్తరణ కోసం చేసిన గుర్తులను మార్పులు పరిశీలించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చేపట్టిన రోడ్డు విస్తరణలో నష్టపరిహారం సొమ్ము దక్కిన యాజమాన్యులు తమ నిర్మాణాలు తొలగించి సహకరించాలన్నారు. సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ నష్టపరిహారం పొందిన భవనాల యాజమాన్యులు ఆర్ అండ్ బి నిబంధనల మేరకు కొత్త నిర్మాణాలు చేసుకోవాలన్నారు.