భారత్ పై అమెరికా విధించిన సుంకాలకు నిరసనగా సీఐటీయు ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డిలో నిరసన ర్యాలీ జరిగింది. సుందరయ్య భవన్ నుంచి కొత్త బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ, ట్రంప్ విధించిన సుంకాలు దేశంలోని అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.