శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం చెరుకూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను స్థానిక కూటమి నాయకులు, అధికారులతో కలిసి మంత్రి సవిత బుధవారం మధ్యాహ్నం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో మంత్రి సవిత లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ల సొమ్మును అందజేశారు. ప్రతినెల ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేస్తున్నారా అని మంత్రి సవిత లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.