పిడుగురాళ్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఉచిత బస్సు కోసం ప్రయాణికులు పరుగులు పెడుతున్నారు. మంగళవారం ఆర్టీసీ బస్సులు చాలా తక్కువగా ఉన్నాయని ప్రయాణానికి ఇబ్బందికరంగా మారిందని పలువురు వాపోయారు. కొంతమంది ప్రయాణికులు ప్రమాదం అని తెలిసి కూడా బస్సును వేలాడుతూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణించే అప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు.