గత 11 నెలలుగా ఇమామ్, మౌసన్ లకు గౌరవ వేత్తనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి గౌరవ వేతనం చెల్లించాలంటూ కాకినాడ వైఎస్ఆర్సిపి మైనార్టీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ సెల్లో వైసిపి మైనార్టీ సెల్ నాయకులు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు కరీం భాషా మీడియాతో మాట్లాడారు.