శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం, మడపం వంశధార పేపర్ మిల్లులో శుక్రవారం సాయంత్రం జరిగిన దుర్ఘటనలో ఉంగటి వాసు అనే కార్మికుడు మృతి చెందారు.. పేపర్ మిల్లులో టన్నులకొద్దీ ఊక తరలిస్తుండగా.. అకస్మాత్తుగా ఊక కార్మికుని పై పడిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. ఇటీవల కాలంలో మిల్లులో పలు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి 9 గంటలకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..