నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చేసిన కృషి అభినందనీయమని రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్సై గంగాధర్ సంజీవ్ కుమార్ అజయ్ శ్రావణి లను పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పోలీసులు రెండు రోజుల పాటు విధులు నిర్వహించి వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా కృషి చేశారని కొనియాడారు.