కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది లారీలో వెళ్తున్న క్లీనర్ లారీ దిగి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే క్లీనర్ మృత్యువాత పడ్డాడు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.పోలీసులు ఘటనపై ఆరాతీస్తున్నారు