ఆదోని పట్టణంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సరైన వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటు చేసిన మూడవ అంతస్తు బిల్డింగ్ లో కనీస వసతులు లేవని, మరుగుదొడ్లలో నీళ్లు లేక ప్రజలు తమ దృష్టికి సమస్యను తీసుకురావడం జరిగింది అన్నారు. దీనిపై ఆసుపత్రి చీఫ్ చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామన్నారు.