ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామంలో కూటమి ప్రభుత్వం సబ్సిడీపై అందించే వ్యవసాయ పిచికారి డ్రోన్ ను సబ్ కలెక్టర్ ఎస్వి త్రివినాగ్ టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఈ డ్రోన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. రైతులకు ఆర్థిక ఇబ్బంది కలగకుండా సబ్సిడీలో వ్యవసాయ పరికరాలను రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని రైతులను విస్మరించిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మేలు చేకూర్చే వ్యవసాయ పథకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.