Parvathipuram, Parvathipuram Manyam | Aug 22, 2025
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం గ్రీన్ అంబాసిడర్లు పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శోభిక కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల, మన్మధరావు జలుమూరు గౌరీ మాట్లాడుతూ గ్రీన్ అంబాసిడర్స్ గ్రీన్ గార్డులు పార్వతపురం మన్యం జిల్లా 15 మండలాల్లో సుమారుగా 1000 మంది పనిచేస్తున్నారు వీళ్ళకి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం స్వచ్ఛభారత్ స్కీమ్లో ఎంపిక చేసి గ్రామాల పరిశుభ్రత కోసం నియమించారన్నారు. ప్రస్తుతం జీతాలు ఇవ్వడం లేదన్నారు.