కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీహార్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ, వరద ముంపు ప్రాంతాలపై లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.రైతులకు యూరియాతో పాటు ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘ కార్యాలయానికి వచ్చిన ఆయన, రైతులను కలసి ముచ్చటించారు.యూరియా అందుతున్న వివరాలను రైతు సోదరులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాయమాటలు నమ్మి ఓట్లు వేస్తే, యూరియా కోసం పడిగాపులు కాచే పరిస్థితిని తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.