అంతర్జాతీయ అక్షరాస్య దినోత్సవం ను పురస్కరించుకుని సోమవారం మధ్యాహ్నం విజయనగరం మండలం గుంకలాం గ్రామంలో జిల్లా స్థాయిలో పలు రకాల కార్యక్రమాలు నిర్వహించారు. వయోజన విద్యాశాఖ జిల్లా నోడల్ అధికారి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ, సదస్సు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్వయం సహాయక సంఘాల మహిళలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.