శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణం కాలేజ్ రోడ్డులో దుకాణ సముదాయాల వెనుక ఉన్న కాలువలో మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు ఆకస్మికంగా మంటలు రావడంతో అక్కడ ఉన్న ప్రజలు నీళ్లు వేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు మరింత చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.