ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 6గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రుని ఆటోలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.