కంకర ట్రాన్స్పోర్ట్ వాహనాలు తప్పనిసరిగా నగర పరిధిలో రోడ్ల మీద కంకర పడకుండా ట్రక్ లపై పరదాలు ఏర్పాటు చేసుకోవాలని, లేకుంటే రోడ్ల మీద పడిన రాళ్ల వలన వాహనాల రాకపోకలకు, పారిశుధ్య పనులకు తీవ్ర ఆటంకంగా ఉంటుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం నగరంలోని నల్లపాడు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఎన్జీఓ కాలనీ, ఏటి అగ్రహారం పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.