యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూరు మండలం కొత్తూరు గ్రామంలో బుధవారం ఉదయం విస్తృతంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామములోని 25 మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను అందజేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే వేసే విధంగా స్థానిక నాయకులు కృషి చేయాలన్నారు. గ్రామంలో పచ్చటి పొలాల్లో నడుస్తూ రైతాంగ సమస్యలను తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ సిబ్బందిని కలిసి వారి సమస్యలను తెలుసుకొని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.