కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో సోమవారం జమ్మలమడుగు నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి లబ్ధిదారులకి సియంఆర్ యఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన 36 మంది లబ్ధిదారులకు 15,12,120 రూపాయల విలువైన సీఎం సహాయనిది చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.