శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పట్టణంలో ఉన్న ప్రశాంతి నగర్ కాలనీలో గత కొంతకాలంగా అద్దెకు ఉంటున్న దీపికా కుమారి (23) అనే వివాహిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మీ కుటుంబం గత కొంతకాలంగా ఉపాధి నిమిత్తం శాంతినగర్ లో నివాసం ఉంటున్నారు. మృతురాలు భర్త ఫిర్యాదు మేరకు పాతపట్నం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.