అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలానికి చెందిన రూకావాండ్లపల్లిలో శుక్రవారం రాత్రి గ్రామంలోకి వచ్చిన జింకను కుక్కలు దాడి చేసి చంపేశాయి. శనివారం గ్రామస్థులు జింక మృతదేహాన్ని గమనించి వీరబల్లి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు, పశువైద్యులను కూడా సంప్రదించి జింక ఎలా మృతి చెందిందో పరిశీలించారు. అనంతరం జింక శవాన్ని అటవీ ప్రాంతానికి తరలించి ఖననం చేశారు. జింక మృతి పై గ్రామస్థులు విచారం వ్యక్తం చేయడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.