Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 13, 2025
మోసాలు ఏ రూపంలో ముంచుకొస్తాయో తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకుంది. దుత్తలూరు మండలంలోని కట్టకిందపల్లి హరిజన కాలనీ, ఏఏ కాలనీలలో రుణాలు ఇస్తామంటూ ఇద్దరు వ్యక్తులు పేద ప్రజలను మోసగించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కనీసం రూ. వెయ్యి విలువ చేయని ఫ్యాన్కు రూ.3,300 కట్టించుకుని రూ.55 వేలు రుణాలు ఇస్తామని కేటుగాళ్లు మోసం చేశారు. ఇలా వందల మంది వద్ద లక్షలాది రూపాయలు దండుకున్నట్లు బాధితులు వాపోయారు.