నంద్యాల జిల్లా బేతంచర్ల సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసిన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని సోమవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం గ్రామంలోని ఫ్యాక్టరీ యాజమాన్యంతో ఎమ్మెల్యే మాట్లాడి, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కంపెనీ VP శ్రీనివాసరావు, HR మేనేజర్ రఘురాం రెడ్డికి సూచించారు. కార్మికులను ఇబ్బంది పెడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.