ఈరోజుమానవపాడు మండల కార్యాలయంలోని ఎమ్మార్వో శ్రీనివాస్ జోషి గారి సమక్షంలో నూతనంగా విచ్చేసిన జిపిఓ గ్రామ పాలన అధికారులకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో సత్కరించడం జరిగినది.ఈ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ గారు మాట్లాడుతూ..గత ప్రభుత్వం తొలగించిన 5000 మంది గ్రామ పాలన అధికారులను తిరిగి నియమిస్తూ… హైటెక్స్ లో కొలువుల పండగలో వారికి నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. ధరణి దురాగతాలకు అడ్డుగా ఉన్నారనే అక్కసుతో గత పాలకులు GPOల వ్యవస్థను రద్దు చేశారని అన్నారు.