స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంకాలం 6గంటలకుభీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పెన్షన్లు, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్, బ్యాంకు లింకేజీ, ఉన్నతి, స్త్రీ నిధి, లైవ్లీ హుడ్స్, అక్షర ఆంధ్ర లెటరసీ కార్యక్రమం పై జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకు లింకేజీలో 72% సాధించి రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచామని, స్త్రీనిధి రుణాలు రూ.62.37 కోట్లు మంజూరై 91% లక్ష్యం నెరవేరిందని వివరించారు.