కాళ్ల మండలం పెదమిరంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణరాజు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎక్కువ సమయం ఇస్తేనే వస్తాననడంపై స్పందించారు. లోక్సభ, శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో సమయం నిర్ణయమవుతుందని, కానీ వారు ఆ సమావేశాలకి రావడం లేదని విమర్శించారు.