భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు గురువారం ఉదయం 8 గంటలకు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.ఈ సందర్భంగా ఇప్పటికే 50 లక్షల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని, నూతన గోపుర నిర్మాణం, క్యూలైన్లతో పాటు ప్రజలకు అన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తయని మరో నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి కానున్నట్లు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోఆలయ ప్రారంభం చేస్తామన్నారు ఎమ్మెల్యే గండ్ర.