యువత క్రీడల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి రాణించాలని ఆదివారం మధ్యాహ్నం గంట్యాడ మండలం రామవరంలో గంట్యాడ మండలాధ్యక్షురాలు పీరుబండి హైమావతి అన్నారు. రామవరం లో ఎంపీపీ సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును ఎంపీపీ హైమావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నూతనంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని విద్యుత్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. జడ్పిటిసి వర్రి నరసింహమూర్తి, వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ జైహింద్ కుమార్, వైసిపి గంట్యాడ మండల అధ్యక్షులు జె అప్పారావు, వైసీపీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు.