నల్లగొండ జిల్లా నడ్డివారి గూడెం నుండి డీవీకే రోడ్డు వరకు డబ్బులు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వరకు పాదయాత్రను సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నల్గొండ పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ నడ్డివారు గూడెం నుండి మన్నెగూడెం గంధవారి గూడెం అక్కలాయగూడెం దేవరకొండ రోడ్డు ప్రకాశం బజార్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు పాదయాత్రను నిర్వహించారు. అనంతరం మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.