ఇసుక తిన్నెలపై ఎగిరి, చల్లగాలులు ఆస్వాదిస్తూ, సాగర జలాల్లో ఆడాలని చాలా మంది అనుకుంటారు. మార్నింగ్ వాక్ చేయాలని సందర్శకులు కోరుకుంటారు. జోడుగుళ్లపాలెం సాగర తీరంలో సముద్రం శనివారం ఉదయం వెనక్కి జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న రాళ్లు బయటపడడంతో సందర్శకులు వాటిపైకి ఎక్కి సాగర ఘోషను ఆస్వాదిస్తున్నారు. సాధారణంగా అప్పుడప్పుడు ఆటుపోటుల కారణంగా సముద్రం ముందుకు రావడం, వెనక్కి వెళ్లడం జరుగుతుంది. సముద్రం వెనక్కి వెళ్లినపుడు మాత్రమే రాళ్లు పైకి తేలి దర్శనమిస్తాయి. సముద్రం సుమారు 200 మీటర్లు దాకా వెనక్కి వెళ్లడంతో బీచ్‌కు వచ్చే సందర్శకులు వాటిపై ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు.