రాష్ట్ర ప్రభుత్వం మందస జీడి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్ అండ్ బి బంగ్లా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సిఐటియు నాయకులు జీడి కార్మిక సంఘ నాయకులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు మాట్లాడుతూ.... మందస మండల పరిధిలో కాల్చిన జీడి పిక్కలు ఇతర ప్రాంతాలకు పరిశ్రమ యాజమాన్లు తరలిస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జీడి కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని, లేనీయడల పోరాటం మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.