కడప జిల్లా కమలాపురం వైసీపీ పార్టీ కార్యాలయంలో శనివారం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రవీంద్రనాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉల్లి రైతులు కుదేలయ్యారన్నారు. ఉల్లి రైతులను కష్టాలు వెంటడుతున్నాయని తెలిపారు.వర్షా బావ పరిస్థితుల తోడు వరదలు, భారీ వర్షాలు లాంటి వైపరీత్యాలకు ఉల్లి రైతులు గురవుతున్నారని తెలిపారు.ఎదురొడ్డి సాగుచేసిన ఉల్లి పంట ధరలు దళారులు అడిగిన రేటుకు విక్రయించాల్సి వస్తుందని ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరించడంతో ఉల్లి రైతులు అతలాకుతలమవుతున్నరని తెలిపారు.