మచిలీపట్నంలో ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ, మండల, నియోజకవర్గస్థాయిలో ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు పాల్గొన్నారు.